అధికార పార్టీ అండతోనే గ్రామాల అభివృద్ధి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
By
Rathnakar Darshanala
అధికార పార్టీ అండతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం.
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
నేటివార్త రాయికల్ ఫిబ్రవరి 6:
రాయికల్ మండలంలోని ఆలూరు, రాజనగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి ఒక్కో గ్రామానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో, జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని, మహిళా సంక్షేమానికి విద్యా, వైద్య రంగాల్లో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టాలని మహిళలు ఎంతో కాలంగా కోరుతున్నారని, వారి విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు నల్లాల స్వామి, భారతపు రాజేష్, ఉపసర్పంచులు సల్ల మహేష్, శ్రీనివాస్, మండల నాయకులు రవీందర్ రెడ్డి, కోల శ్రీనివాస్, మోర హనుమండ్లు, గన్నెరాజిరెడ్డి భాస్కర్ రావు, సురేందర్ రెడ్డి, రామ్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, గ్రామ, మండల నాయకులు పాల్గొన్నారు.
Comments