రాంగ్ రూట్‌లో వస్తే నేరుగా క్రిమినల్ కేసులే.
By
Rathnakar Darshanala
రాంగ్ రూట్‌లో వస్తే నేరుగా క్రిమినల్ కేసులే.
నేటి వార్త,సైబరాబాద్:
తప్పుడు మార్గంలో వాహనాలు నడిపి తోటి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే ఇకపై కఠినమైన జైలు శిక్షలు తప్పవని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్, డీసీపీ శేషాద్రి రెడ్డి ఆదేశాల మేరకు మాదాపూర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఏ. శ్రీధర్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం 100 ఫీట్ రోడ్డు, సైబర్ టవర్స్, దుర్గం చెరువు, మైండ్ స్పేస్ తదితర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
ఈ డ్రైవ్‌లో రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తూ పట్టుబడిన 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఐదుగురు డ్రైవర్లపై మాదాపూర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్‌లో నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
గతంలో కేవలం చలాన్లతో సరిపెట్టేవాళ్లమని, వాహనదారుల వైఖరిలో మార్పు రాకపోవడంతో ఇకపై కఠినంగా వ్యవహరించాలని సీపీ ఆదేశించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో ఆర్.ఐ. శ్రీకాంత్, ఎస్.ఐ.లు రాములు, రాంబాబు, టీవీ రావు, ఆర్.ఎస్.ఐ. రాఘవేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Comments