నేటివార్త కథనానికి స్పందించిన అధికారులు.

Rathnakar Darshanala
నేటివార్త కథనానికి స్పందించిన అధికారులు.
 *ఇందిరానగర్‌లో పగిలిన పైపు లైన్ రిపేర్*

నేటివార్త రాయికల్ ఫిబ్రవరి 3:
రాయికల్  పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో పగిలిన తాగునీటి పైపు లైన్ వల్ల భారీగా నీరు వృధా అవుతున్న విషయాన్ని “పైపు లైన్ పగిలి వృధాగా తాగునీరు…” అనే శీర్షికతో నేటివార్త దినపత్రికలో ప్రచురించడంతో సంబంధిత అధికారులు స్పందించారు. 

మంగళవారం రోజున తక్షణమే అక్కడికి చేరుకున్న సిబ్బంది పగిలిన పైపు లైన్‌ను రిపేర్ చేయించి నీటి వృథాను అరికట్టారు.

ఈ సమస్యపై స్పందించి చర్యలు తీసుకున్న అధికారులకు, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన నేటివార్త విలేఖరికి ఇందిరానగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. 

ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రింట్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందనడానికి ఇదొక ఉదాహరణగా నిలిచింది.
Comments