రెండే గంటల్లో సుఖాంతం- పోలీసులకు కృతజ్ఞతలు..
By
Rathnakar Darshanala
రెండే గంటల్లో సుఖాంతం- పోలీసులకు కృతజ్ఞతలు..
నేటి వార్త,సైబరాబాద్:
సైబరాబాద్ కమిషనరేట్ మియాపూర్ పీస్ పరిధిలోని న్యూ కాలనీకి చెందిన రాజేష్ కుమారుడు సిద్ధార్థ్(5) సోమవారం ఉదయం ఇంటి బయట ఆడుకుంటూ దారి తప్పి సుమారు కిలోమీటర్ దూరం వెళ్లగా,
విధుల్లో ఉన్న పెట్రోలింగ్ పోలీసులు ఆ బాలుడిని గమనించి కేవలం రెండు గంటల వ్యవధిలోనే క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం అదృశ్యమైన తమ బాబు కోసం ఆందోళన చెందుతూ, పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్న తరుణంలోనే పోలీసులు స్వయంగా బాలుడిని తీసుకువచ్చి అప్పగించడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
సకాలంలో స్పందించి తమ బిడ్డను అప్పగించిన పోలీసుల సమయస్ఫూర్తిని, పనితీరును అభినందిస్తూ బాధితులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments