కన్నుల పండుగగా భీమేశ్వర కళ్యాణం.
By
Rathnakar Darshanala
కన్నుల పండుగగా భీమేశ్వర కళ్యాణం.
:భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఉత్సవాలు
నేటివార్త రాయికల్ ఫిబ్రవరి 2:
రాయికల్ పట్టణ కేంద్రంలోని
భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం భక్తిశ్రద్ధల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు.
సాంప్రదాయ వేద మంత్రోచ్ఛారణలతో, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ కళ్యాణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
సోమవారం ఉదయం ఆలయంలో భీమేశ్వర స్వామికి భక్తులు పెద్ద సంఖ్యలో ఒడిబియ్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.నర్ర సతీష్ యాదవ్ ఒగ్గు కథా కళాబృందం కళాకారుల ప్రదర్శనలు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చాయి.
మంగళవారం రోజున స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఉత్సవ నిర్వాహకులు దేవుని లింగయ్య తెలిపారు.
ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారి కృప పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భీమన్న యూత్ అధ్యక్షుడు సుధాకర్, ఉపాధ్యక్షుడు గంగాధర్,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments