వ్యాస రచన పోటీలో మెరిసిన మహిమాన్విత.

Rathnakar Darshanala
వ్యాస రచన పోటీలో మెరిసిన మహిమాన్విత.
నేటి వార్త జగిత్యాల బ్యూరో జనవరి 29:


ఈనాడు పత్రికా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాస రచన పోటీలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆఫ్ ఎక్సలెన్సీ పాఠశాలకు చెందిన విద్యార్థిని రాచర్ల మహిమాన్విత ప్రతిభ కనబరిచి బహుమతి సాధించింది.

 ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న మహిమాన్వితకు జిల్లా విద్యా అధికారి (డీఈఓ) చేతుల మీదుగా బహుమతి అందజేయబడింది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ అనగళ్ళ రాజేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు పాఠ్యవిద్యతో పాటు సాహిత్య రంగంలోనూ తమ ప్రతిభను చాటుకోవడం గర్వకారణమన్నారు. 

మహిమాన్విత సాధించిన విజయం పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిందని తెలిపారు.
విద్యార్థిని విజయంపై ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. 

ఇలాంటి సాహిత్య పోటీలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.
Comments