వీధి కుక్క స్వైర విహారం..8మందికి గాయాలు.
By
Rathnakar Darshanala
వీధి కుక్క స్వైర విహారం..8మందికి గాయాలు.
తాండూర్,నేటివార్త,(ఫిబ్రవరి 03)
వీధి కుక్క స్వైర విహారం చేసింది. పలు చోట్ల 8 మందిని తీవ్రంగా గాయపరిచింది.
తాండూర్ మండలంలోని మండల కేంద్రంతో పాటు, యూనియాన్ బ్యాంకు, బస్ స్టాండ్ సమీపంలో వివిధ పనుల మీద వెళ్తున్న వారిని పిచ్చి కుక్కలు దొరికిన వారిని దొరికినట్టు కరుస్తూ పోయాయి.
పిచ్చికుక్కల కాటుకు లక్ష్మణ్,సదయ్య,రాజేశ్వరి.రాజేష్,సునీల్,శ్వేత,శోభ,స్వర్ణలత లకు గాయాలయ్యాయి.వీళ్ళందరినీ స్థానికుల సహాయంతో స్థానిక ప్రభుత్వ సుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు.
సదయ్య, రాజేష్, లక్ష్మణ్ లకు గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యురాలు లక్ష్మి ప్రసన్న తెలిపారు.
జన సంచారం ఉన్న చోట శునకాలు లేకుండా చూడాలని వాటి భారీ నుండి ప్రజలను రక్షించాలని బాధితులు సంబంధిత అధికారులను , ప్రజాప్రతినిధులను కోరారు.
Comments