జిడికే ఓసి–5 ప్రాజెక్ట్‌లో చారిత్రాత్మక రికార్డు.
By
Rathnakar Darshanala
జిడికే ఓసి–5 ప్రాజెక్ట్‌లో చారిత్రాత్మక రికార్డు.
ఒక్కరోజులో 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తి – 18,831 టన్నుల రవాణా.
నేటి వార్త ఫిబ్రవరి 04 రామ మందిర్ ఏరియా కాశెట్టి శివ.
ఆర్జీ–I ఏరియాలోని జిడికే ఓసి–5 ప్రాజెక్ట్‌లో రోజువారీ ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా కేటాయించిన 9,666 టన్నుల లక్ష్యానికి మించి, నిన్న తేది: 03.02.2026న మూడు షిఫ్టులలో కలిపి ఒక్కరోజులో 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 18,831 టన్నుల బొగ్గు రవాణా సాధించి కొత్త రికార్డును నెలకొల్పారు.
ఈ సందర్భంగా ఆర్జీ–1 ఏరియా జనరల్ మేనేజర్ డీ.లలిత్ కుమార్ జిడికే ఓసి–5 ప్రాజెక్ట్‌ను సందర్శించి, ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు, యూనియన్ ప్రతినిధులను అభినందించారు.
అనంతరం కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, గతంలో తేది: 30.03.2024న ఒక్కరోజులో 19,113 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగగా, నిన్నటి రోజున 20,031 టన్నుల బొగ్గు ఉత్పత్తితో పాటు 18,831 టన్నుల బొగ్గు రవాణా సాధించడం ద్వారా కొత్త రికార్డు సృష్టించామని తెలిపారు.
ఈ ఘనత అందరి సమిష్టి కృషి, అత్యుత్తమ పనితీరు, పరస్పర సహకారం, సమన్వయం, క్రమశిక్షణ మరియు అంకితభావం వల్లనే సాధ్యమైందని ఉద్యోగులను జీఎం ప్రశంసించారు.
ఈ అద్భుత విజయాలు ఆర్జీ–I ఏరియాకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ఈ విజయాలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన ఉత్పత్తి లక్ష్యాలను కూడా అధిగమించాలని జీఎం ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఎఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ డి.రమేష్, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి.రమేష్, స్టాట్యూటరీ మేనేజర్ రమేష్ బాబు, మేనేజర్ అనిల్ గబాలే, సేఫ్టీ ఆఫీసర్,
సీఎంవోఎఐ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పొనుగోటి శ్రీనివాస్, సీఎంవోఎఐ ఆర్జీ–1 ఉపాధ్యక్షులు పెరుమాండ్ల శ్రీనివాస్, సీనియర్ సర్వే అధికారి దీటి చంద్రమౌళి, గని క్వాలిటీ ఇన్‌చార్జ్ ఏ.రవి, బేస్ వర్క్ షాప్ ఇన్‌చార్జ్ ఆర్.మహేష్,
సంక్షేమాధికారి దాసరి నాగారాజు, ఎఐటీయూసీ ఫిట్ సెక్రటరీ గుర్రం ప్రభుదాస్, పీసీ పటేల్ కాంట్రాక్ట్ మేనేజర్ గౌరంగ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
Comments