కడప :రౌడీ షీటర్లకు మాస్ కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నరేష్ బాబు.
By
Rathnakar Darshanala
రౌడీ షీటర్లకు మాస్ కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నరేష్ బాబు.
( నేటివార్త ) కడప జిల్లా జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు అర్బన్ సీఐ నరేష్ బాబు సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మాస్ కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ నరేష్ బాబు మాట్లాడుతూ ఇప్పటికైనా రౌడీషీటర్లు తమ నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తన తో జీవించాలని సూచించారు.
నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ ఉండేవారికి చివరి అవకాశంగా కౌన్సిలింగ్ ఇస్తున్నామని ఒకటికి ఎక్కువసార్లు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పట్టుబడితే వారికి కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
ఇప్పటికైనా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని గొడవలకు ఎవరు వెళ్ళరాదని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments