బైక్ పై ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు.

Rathnakar Darshanala
బైక్ పై ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు.
నేటి వార్త :
వనదేవతలు కొలువైన మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించేందుకు గురువారం మంత్రులు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. 

కారు దిగి బైక్ ఎక్కారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో కలిసి స్వయంగా బైక్ నడుపుతూ గల్లీ గల్లీని చుట్టేశారు. 

ప్రోటోకాల్ గోడలు బద్ధలు కొట్టి, సామాన్యుడిలా భక్తుల చెంతకు చేరారు.జంపన్న వాగు వద్ద భక్తులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.
*టీ ముచ్చట: ప్రజా గొంతుక కోసం.. టీ కొట్టు వద్ద ఆగి అక్కడ ఉన్న ప్రజల తో కాసేపు ముచ్చటించారు,ఒక టీ కొట్టు వద్ద ఆగి, చాయ్ తాగుతూ అక్కడున్న భక్తులతో ముచ్చటించారు. ఛాయ్ వాలాతో చ‌మ‌త్క‌రించారు.  "ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సౌకర్యాలు ఎలా ఉన్నాయి?" అంటూ ఆరా తీశారు.
అంతేగాక‌ఏ ఒక్క భక్తుడికి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అధికారులకు అక్కడికక్కడే దిశానిర్దేశం చేశారు.
Comments