ADB:మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గది ప్రారంభం.
By
Rathnakar Darshanala
ADB:మహిళా పోలీసు సిబ్బందికి ప్రత్యేక విశ్రాంతి గది ప్రారంభం.
జిల్లా లో మహిళల భద్రతకు, రక్షణకు మొదటి ప్రాధాన్యత.
తలమడుగు పోలీస్ స్టేషన్ పరిశీలన.
*రిబ్బన్ కట్ నూతన గదిని ప్రారంభించిన మహిళా ఎస్ఐ డి రాధిక.
*రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరగాలని సూచన.
*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.*
నేటి వార్త ఆదిలాబాద్ :
జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను కేటాయిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలిపారు.
తలమడుగు పోలీస్ స్టేషన్ నందు మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర పనుల నిమిత్తం ప్రత్యేకంగా నూతన గదిని జిల్లా ఎస్పీ శాస్త్రోక్తంగా, వేద మంత్రోచరణల నడుమ ప్రత్యేకంగా మహిళా ఎస్సై చే రిబ్బన్ కట్ చేపించి నూతన గదిని ప్రారంభించారు.
మహిళల భద్రత కై జిల్లాలో నూతనంగా మహిళ పోలీసు సిబ్బందిచే పెట్రోలింగ్ కార్యక్రమాలను త్వరలో ప్రారంభించనున్నట్లు, మహిళల రక్షణకై షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటూ రక్షణ చర్యలను చేపడుతున్నట్టు తెలిపారు.
మహిళలు, చిన్నారుల భద్రతకై *షీ టీం* ఆధ్వర్యంలో పోలీసు అక్క ప్రారంభించి చిన్నారులకు మరింత దగ్గర అయిందని,
మరియు ఆపరేషన్ జ్వాల కరాటే నందు శిక్షణ అందించడం జరిగిందని, మహిళల పట్ల జరుగు నేరాలపై పాఠశాలలు కళాశాలలు గ్రామ గ్రామాల మహిళలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ చైతన్య పరిచయం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా తలమడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించి రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలని,
ఎలాంటి పెండెన్సీ లేకుండా బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ సిబ్బందిని కేటాయించి సమస్యల పరిష్కరించాలని తెలిపారు.
పెండింగ్లో ఉన్న కేసులు దర్యాప్తును పూర్తి చేసి కోర్టులలో చార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ కె ఫణిదర్, తాంసి ఎస్ఐ డి రాధిక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments