నిషిద్ధ చైనా మాంజాపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్.

Rathnakar Darshanala
నిషిద్ధ చైనా మాంజాపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్.
 నేటి వార్త, సైబరాబాద్:

ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులకు ప్రాణసంకటంగా మారుతున్న నిషిద్ధ చైనా మాంజా తొలగింపునకు సైబరాబాద్ పోలీసులు బుధవారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

 కేపీహెచ్‌బీ, మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న మాంజాను జీహెచ్‌ఎంసీ అధికారుల సహకారంతో తొలగించారు. 

కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌ఓ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన రహదారులతో పాటు నివాస ప్రాంతాల్లో తనిఖీలు చేసి దుకాణదారులను హెచ్చరించారు. 

మాదాపూర్, కూకట్‌పల్లి పరిధిలో విక్రయ కేంద్రాలను తనిఖీ చేయగా, జీడిమెట్ల పోలీసులు పాఠశాల విద్యార్థులకు మాంజా వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. 

మాంజా విక్రయం, నిల్వ లేదా వినియోగం నేరమని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. 

ఎక్కడైనా మాంజా వేలాడుతూ కనిపిస్తే జాగ్రత్తగా తొలగించాలని, విక్రయాల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు సూచించారు.
Comments