గంగమ్మ జాతరలో కనువిందు చేసిన అప్పిశెట్టి.
By
Rathnakar Darshanala
గంగమ్మ జాతరలో కనువిందు చేసిన అప్పిశెట్టి.
తిరుపతి జిల్లా, కాళహస్తి — శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు భక్తివైభవంగా నిర్వహించిన గంగమ్మ జాతరలో రాష్ట్రవ్యాప్తంగా భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈ జాతర సందర్బంగా రాష్ట్ర ఉపాధ్యక్షుల ఆహ్వానం మేరకు ప్రకాశం జిల్లా గిద్దలూరు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జాతరలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, టిడిపి సీనియర్ నాయకులు పాటకం వెంకటేష్, ఉదయ్ శంకర్‌లు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించిన నాయకులు రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి పరిపాలనలో సుఖసంతోషాలతో జీవించాలని కోరుకున్నారు.
అప్పిశెట్టి ఉదయ్ శంకర్ మాట్లాడుతూ—
“అమ్మ గంగమ్మ తల్లి కృప రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కలగాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ప్రజల ఆశీర్వాదాలతో మరింత ఉన్నత పదవులకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము” అని పేర్కొన్నారు.
జాతర ప్రాంగణంలో వేలాది మంది భక్తులు, స్థానికులకు కోల ఆనంద్ విందు భోజనాలు ఏర్పాట్లు చేశారు.
Comments