ADB :రిమ్స్ లో జాబ్ ఫ్రాడ్ ఘటనలో ముగ్గురిపై కేసు,దుర్గం శేఖర్ అరెస్ట్.
By
Rathnakar Darshanala
ADB :రిమ్స్ లో జాబ్ ఫ్రాడ్ ఘటనలో ముగ్గురిపై కేసు,దుర్గం శేఖర్ అరెస్ట్.
*బాధితుని వద్ద నుండి రూ 40 వేలు వసూలు..*
*దుర్గం ఎస్సీ లేబర్ కాంటాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆదిలాబాద్ పేరుతో మోసం.*
*ప్రధాన నిందితుడు, అనుచరుడు అరెస్ట్, మరొకరి పరారీ.*
*సంస్థ ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించవచ్చు.*
*ఉద్యోగుల పేరుతో మోసం చేసే బ్రోకర్లను, నకిలీ సంస్థలను నమ్మవద్దు, డబ్బులు ఇవ్వద్దు.*
*ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు*
నేటి వార్త ఆదిలాబాద్ :
*నిందితుల వివరాలు*
A1) దుర్గం శేఖర్(50) s/o బుచ్చన్న, కైలాసనగర్ ఆదిలాబాద్.
A2) మహేందర్ (దుర్గం శేఖర్ పిఏ) (పరారీ)
A3) కావాటి మోహన్ (29) s/o దేవన్న, KRK కాలనీ ఆదిలాబాద్.
రిమ్స్ నందు ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాధితున్ని వద్ద ఏడు నెలల పని చేయించి, వేతనాన్ని ఇవ్వకుండా పలువురిని మోసం చేసినటువంటి ఘటనలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ముగ్గురి పై కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు మరియు అనుచరులని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు తెలియజేశారు.
*వివరాలలో*
బాధితుడు అంకోలి గ్రామానికి చెందిన మెస్రం రాహుల్ 2024 సంవత్సరం ఏప్రిల్ నందు దుర్గం శేఖర్ ద్వారా నిర్వహించబడుతున్న దుర్గం ఎస్సీ లేబర్ కాంటాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా రిమ్స్ నందు తన అనుచరులైన మహేందర్ మరియు,
మోహన్ లకు 40 వేల రూపాయలను ఇచ్చి ప్రైవేటు ఉద్యోగానికి నెలకు 15000 చొప్పున ఉద్యోగంలో చేరాడు.
నవంబర్ 2024 నుండి ఏడు నెలలు ఉద్యోగం చేసిన తర్వాత కూడా అతనికి ఎలాంటి వేతనం ఇవ్వక పోయేసరికి అతను తిరిగి వీరికి తన డబ్బులు తనకు ఇవ్వాలంటే అడగక వీరు నిరాకరించడం తో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా,
టూ టౌన్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఈరోజు ప్రధాన నిందితుడు దుర్గం శేఖర్ మరియు అతని అనుచరుడు మోహన్ లను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.
ఇంకొక అనుచరుడు పరారీలో ఉండగా అతనిని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఇప్పటివరకు వీరు ఆరుగురుని మోసం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, ఈ సంస్థ ద్వారా మోసపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.
నిరుద్యోగులు ఎలాంటి బ్రోకర్లను, సొసైటీలను నమ్మవద్దని, వాటిని నమ్మి డబ్బులను ఇవ్వవద్దని, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడతాయని తెలిపారు.
నిరుద్యోగులను మోసం చేసే వారి పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తూ, పోలీసు చర్యలను తీసుకుంటుందని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Comments