తుఫాన్-అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.
By
Rathnakar Darshanala
తుఫాన్-అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.
బీజేపీ మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్
నేటివార్త నవంబర్1 గంగాధర రిపోర్టర్(జంగిలి మహేందర్)
గంగాధర బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
గంగాధర ఎమ్మార్వో కి శనివారం వినతిపత్రం అందజేసి,తుఫాన్ వల్ల గంగాధర మండల పరిధిలోని రైతులు భారీగా నష్టపోయారు.
దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పంజాల ప్రశాంత్ మాట్లాడుతూ..
తక్షణమే ధాన్యాన్ని తేమ లేకుండా కొనుగోలు చేసి,వర్షం వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని,తడిసిన దాన్యానికి ఎలాంటి అంక్షలు లేకుండా కొనుగోలు చేసి. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులను కల్పించి రైతులను ఆదుకోవాలని
డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను కలుపుకొని ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా పిలుపును ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మండలాధ్యక్షలు కోల అశోక్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తూమ్ నారాయణ, సదాల భాస్కర్, పెంచాల రాములు, రేండ్ల శ్రీనివాస్, వొడ్నాల రాజు, ఆకుల మనోహర్ పటేల్,
దాసరి ఆంజనేయులు,
తాళ్ల రాజశేఖర్, చిందం ఆంజనేయులు, సుంకరి అనిల్, కొమురయ్య, పృథ్వి గౌడ్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments