జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు.

Rathnakar Darshanala
జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు.
 నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిధి  నవంబర్  2 :

పాఠశాల క్రీడా సమాఖ్య నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్ 14, 17 సంవత్సరాల బాలబాలికల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ జట్టు ఎంపికలను నిర్వహించనున్నారు. 

ఈ ఎంపికల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు తమ పాఠశాల నుండి బోనఫైడ్ సర్టిఫికేట్, ప్రస్తుత తరగతి వివరాలు, జనన సర్టిఫికేట్, గత సంవత్సరం మార్క్స్ కార్డ్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. 

అథ్లెటిక్స్ ఎంపికకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 9 గంటలకు లోగా రిపోర్ట్ చేయాలి. అండర్ 17 వయస్సు గల విద్యార్థులకు కట్ ఆఫ్ తేదీ 01.01.2009గా, అండర్ 14 వయస్సు గల వారికి 01.01.2012గా నిర్ణయించారు. 
కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి దర్శనం భోజన్న ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఎస్.జి.ఎఫ్. ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.రవీందర్ తెలిపారు.

 ఈ ఎంపికలకు కన్వీనర్‌గా ఎస్.జి.ఎఫ్. సెక్రటరీ నిర్మల్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

ఆర్గనైజర్లుగా నరాల సత్తయ్య (పీడీ, జడ్‌పీహెచ్‌ఎస్ మంజులాపూర్, ఫోన్: 98496 68725) మరియు గిరి ప్రసాద్ (పీ.ఇ.టి, విజయ స్కూల్ నిర్మల్, ఫోన్: 85010 54234) వ్యవహరిస్తారని తెలిపారు.
Comments