మట్టితో చేసిన శివ లింగానికి సాధువుల మహా రుద్రాభిషేకం.
By
Rathnakar Darshanala
మహా రుద్రాభిషేకం.
మట్టితో చేసిన మహా శివలింగానికి సాధువుల అభిషేకం, వేలాదిమంది భక్తుల సందడి
నేటి వార్త,గిద్దలూరు, నవంబర్ 2.
గిద్దలూరులో మహా రుద్రాభిషేకం కార్యక్రమం లో భాగంగా ఈరోజు గిద్దలూరు టు ఒంగోలు రహదారిలోని బాలకృష్ణ ప్రాంగణంలో విశేష ఆధ్యాత్మిక వాతావరణంలో మట్టితో నిర్మించిన మహా శివలింగానికి సాధువులు ఘనంగా అభిషేకాలు నిర్వహించారు.
ఈ పవిత్ర కార్యక్రమం బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అద్భుతమైన భక్తి భావంతో జరిగింది.
వెల్లువల్లున భక్తజనం “ఓం నమః శివాయ” నినాదాలతో గగనమంతా మార్మోగించారు. పంచామృతాలతో,
సువాసన ద్రవ్యాలతో, గంగాజలంతో సాధువులు శివలింగాభిషేకం జరపగా, ఆ దృశ్యాన్ని చూసిన భక్తులు ఆత్మీయంగా శివారాధనలో మునిగిపోయారు.
కార్యక్రమం సందర్భంగా వేద పండితులు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా వేలాదిమంది మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ మహా రుద్రాభిషేకం విజయవంతంగా ముగిసిన అనంతరం ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు నిండుగా పాల్గొని దివ్యానుభూతి పొందారు.
Comments