SI వంశీకృష్ణ ఆధ్వర్యంలో "వాక్ ఫర్ యూనిటీ" కార్యక్రమం.
By
Rathnakar Darshanala
SI వంశీకృష్ణ ఆధ్వర్యంలో "వాక్ ఫర్ యూనిటీ" కార్యక్రమం.
నేటివార్త అక్టోబర్30 గంగాదర రిపోర్టర్(జంగిలి మహేందర్)
అక్టోబర్31 రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతి సందర్భంగా *జాతి ఐక్యత* దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా గురువారం రోజున గంగాధర ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో మధురానగర్ లోనీ
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాల విద్యార్థినిలు, కళాశాల సిబ్బంది,స్థానిక రాజకీయ నాయకులు మరియు ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి గంగాధర మండల కేంద్రంలో 2KM "వాక్ ఫర్ యూనిటీ" కార్యక్రమం నిర్వహించడం జరిగింది,
ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్ఐ మాట్లాడుతూ వల్లభాయ్ పటేల్ యొక్క ఉద్దేశాలను, ఆశయాలను పాఠశాల విద్యార్థులకు వివరించడం జరిగింది.
పాఠశాలలో ఇటీవల జరిగిన సంఘటన నేపథ్యంలో పాఠశాలలో విద్యార్థినిలు తమకు ఏ సమస్య ఉన్న వెంటనే పాఠశాల ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో లేదా నేరుగా పోలీసులకు వెంటనే చెప్పాలని,
ఇంకా ఇతర ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని వెంటనే మేము పరిష్కరిస్తామని ఎస్ఐ వంశీకృష్ణ తెలపడం జరిగింది.
Comments