రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్.
By
Rathnakar Darshanala
రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్.
•తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి
మల్లాపూర్ అక్టోబర్ 30 (నేటి వార్త దిన పత్రిక):
మల్లాపూర్ మండలం వ్యాప్తంగా రైతులను నిండా ముంచిన మొంథా తుఫాన్ చేతికొచ్చిన పంట నీటిపాలాయే అంటు రైతులు కన్నీరు పెట్టుకున్న సంఘటన వెంకట్రావుపేట గ్రామంలో జరిగింది.
కల్లాలో అరబోసిన మొక్కజొన్న పూర్తిగా తడిసి పోయింది.గుగ్లావత్ భూమాన్నా,గుగ్లావత్ లక్ష్మణ్,రాము జగన్,దేశాయ్,మ్యాడారపు తుక్క రెడ్డి,గడ్డం రాజారెడ్డి కి సంబందించిన మొక్కజొన్న పూర్తిగా తడిచి పోయింది.
రైతులు మాట్లాడుతూ. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి వేంపల్లి వెంకట్రావుపేటలో మొక్కజొన్న కొనుగోలు సబ్ సెంటర్ ను ఏర్పాటుచేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Comments