Hyderabad :రైతుల సమస్యలను పరిష్కరించండి.ఎమ్మెల్యే పాయల్ శంకర్.
By
Rathnakar Darshanala
Hyderabad :రైతుల సమస్యలను పరిష్కరించండి.ఎమ్మెల్యే పాయల్ శంకర్.
* మంత్రి తుమ్మల కు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి.
నేటి వార్త ఆదిలాబాద్ :
పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు ఎమ్మెల్యే పాయల్ శంకర్ విన్నవించారు*
ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. సోయా బీన్ పంటకు ప్రభుత్వమే కనీస మద్దతు ధర తో కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
రైతులు మార్కెట్‌లో తక్కువ ధరలకు అమ్మతున్నారనీ, ప్రస్తుతం రైతులు క్వింటాల్‌కు రూ.1200–రూ.1500 వరకు నష్టపోతున్నారన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు బెంగాల్ గ్రామ్ విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని కోరారు.
పత్తి అమ్మకాలకు వచ్చే రైతులు గంటల కొద్దీ వేచిచూసే పరిస్థితి ఉందనీ, అందువల్ల మార్కెట్ యార్డ్ లో రైతులకు ఆహారం పంపిణీ చేయాలన్నారు.
అలాగే కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని సూచించారు. వరదల ప్రభావిత మండలాల్లో పంటల నష్టం జరిగిన రైతులకు తక్షణం పంట పరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments