వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్.

Rathnakar Darshanala
వరి, మొక్కజొన్న  కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్.

నేటి వార్త అక్టోబర్ 22 గొల్లపల్లి: 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ చైర్మన్ భీమా సంతోష్ అన్నారు.

 సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్   ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా  గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన  వరి, మొక్కజొన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రోజున ఏఎంసి చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు వరికి  రూ.2389, మొక్కజొన్న కు  రూ.2400 మద్దతు ధర లభిస్తుందని అన్నారు.

కాబట్టి రైతులు తమ ధాన్యాన్ని  ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్, పురపాటి రాజిరెడ్డి, ప్యాక్స్ సీఈఓ సుధాకర్, ఏఎంసీ సెక్రటరీ వరలక్ష్మి, డైరెక్టర్లు అత్తెన శివయ్య, 

తిరుపతి, మాజీ సర్పంచులు  సత్యనారాయణ గౌడ్, అరవింద్ గౌడ్, ఉప సర్పంచ్  కొండ వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
Comments