భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన.|| Neti Vartha ||

Rathnakar Darshanala
భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన.
నేటివార్త, అక్టోబర్ 22, తాండూర్:

మండలంలోని మాదారం టౌన్ షిప్ లో బుధవారం కార్తీకమాసం సందర్భంగా భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు.

 శ్రీ కోదండ రామాలయంలో వేద పండితులు ముద్దు అవధూత శర్మ వేద మంత్రోచ్ఛరనల మధ్య పూజలు నిర్వహించి నగర సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

భజనలు కీర్తనల మధ్య కోదండ రామాలయం భూలక్ష్మి శివాలయం శ్రీ వృక్ష వరసిద్ధి వినాయక స్వామి పోచమ్మ పెద్దమ్మతల్లి ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేశారు. 

కార్తీక మాసం చివరి వరకు ప్రతిరోజు నగర సంకీర్తన కొనసాగుతుందని భక్తులు తెలిపారు.
Comments