అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.

Rathnakar Darshanala
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం.
చొప్పదండి ఎమ్మెల్యే డా"మేడిపల్లి సత్యం

నేటివార్త అక్టోబర్ 30 గంగాధర రిపోర్టర్(జంగిలి మహేందర్)

*గంగాధర మండలంలోని గంగాధర, మంగపేట,  ఇస్లాంపూర్  గ్రామాల్లో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించిన ఎమ్మెల్యే*

 అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భరోసా ఇచ్చారు. 

గంగాధర వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గంగాధర, మంగపేట, ఇస్లాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా  నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని,   తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని  వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. 

ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని  భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్  జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి,సింగల్ విండో చైర్మన్ దూలం బాల గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, 

తాసిల్దార్ అంబటి రజిత,ఎండివో రామ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య,పడాల రాజన్న, సాగి అజయ్ రావు, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, 

రోమాల రమేష్, పడితపల్లి కిషన్, గుజ్జుల బాపురెడ్డి, గడ్డం  అంజయ్య, కరుణాకర్, చందు, మధు,రాచమల్ల భాస్కర్,మంత్రి మహేందర్, శ్రీనివాస్, గంగాధర ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments