భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - సీపీ గౌష్ ఆలం.

Rathnakar Darshanala
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - సీపీ గౌష్ ఆలం.
 నేటివార్త, అక్టోబర్ 29,కరీంనగర్. టి. ప్రశాంత్

తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

వాతావరణ శాఖ సూచనల ప్రకారం, బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రభావం వల్ల కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ 29 మరియు 30 తేదీలలో విస్తృతంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో, ప్రజల భద్రత దృష్ట్యా సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకు విజ్ఞప్తి:

అత్యవసరమైతే తప్ప ఎవరూ తమ ఇళ్ల నుండి బయటకు రావద్దు.

ప్రయాణాలు పూర్తిగా వాయిదా వేసుకోవాలి.
ప్రమాదకరమైన ప్రాంతాల వైపు వెళ్లవద్దు.
ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. 

అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్  +918712670744 ,+918712670745 నంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు.

*పోలీసు అధికారులకు ఆదేశాలు:*
అన్ని పోలీసు స్టేషన్ల ఎస్.హెచ్.ఓ.లు అప్రమత్తంగా ఉండాలి.

వారి వారి స్టేషన్ పరిధిలోని గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సీపీ గౌష్ ఆలం ఆదేశించారు.

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని సీపీ గౌష్ ఆలం కోరారు.
Comments