కొనసీమ జిల్లా లో పంట నష్టం ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.

Rathnakar Darshanala
కొనసీమ జిల్లా లో పంట నష్టం ని పరిశీలించిన సీఎం చంద్రబాబు.
నేటి వార్త ఆంధ్రప్రదేశ్ :

గత రెండు రోజుల నుండి మెంత తుఫాన్ ప్రభావం తొ కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం పలు జిల్లాలలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు.

ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆడుకుంటుంది అని వారికీ భరోసా కల్పించారు.

అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లవరం మండలం, ఓడలరేవులో మొంథా తుఫాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లి బాధితుల క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. 
నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం నుండి నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం, ఒక్కో కుటుంబానికి రూ.3 వేల చొప్పున సాయం అందినట్టు వారు చెప్పారు. అనంతరం అరగట్లపాలెం, బెండమూరులంక గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడారు. 

నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు వీలైనంత త్వరగా పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Comments