బంద్ కు అన్ని పార్టీలు మద్దతే ...ఈ పోరాటం ఎవరి మీద..?

Rathnakar Darshanala
బంద్ కు అన్ని పార్టీలు మద్దతే ...ఈ పోరాటం ఎవరి మీద..?
నేటి వార్త ఉమ్మడి ఆదిలాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయ చర్చకు దారితీసింది. 42% రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా బీసీ సంఘాలు పిలుపునిచ్చినప్పటికి. 

రాష్ట్ర బంద్‌ కు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీతో పాటు అఖిలపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌,సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి.

అయితే ఈ పరిస్థితి ఒక ఆసక్తికర ప్రశ్నను తెరపైకి తెచ్చింది తెలంగాణ రాష్ట్ర బంద్‌ ఎవరిపై పోరాటం చేస్తున్నది..?అన్నది. సాధారణంగా బంద్‌లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదా ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం కోసం నిర్వహిస్తారు. 

కానీ ఈ సందర్భంలో పాలక పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం, బంద్‌ ఉద్దేశ్యాన్ని అస్పష్టంగా మార్చింది.ఈ బంద్‌తో ప్రజలకు ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఉండదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ చుసిన దీని పైనే చర్చ జరగడం విశేషం.
Comments