జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో చిల్డ్రన్ పార్క్ జిమ్ ను ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం.
By
Rathnakar Darshanala
జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో చిల్డ్రన్ పార్క్ జిమ్ ను ప్రారంభించిన సీపీ గౌష్ ఆలం.
*అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం; 72 యూనిట్ల రక్తం సేకరణ*
కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) శ్రీ గౌష్ ఆలం గారు ఈరోజు జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్ మరియు స్టేషన్ సిబ్బంది కోసం జిమ్ సెంటర్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, చిన్నారుల మానసిక ఉల్లాసం, పోలీసు సిబ్బంది శారీరక దృఢత్వం కోసం ఈ సౌకర్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని హుజురాబాద్ డివిజన్‌లో ఏసిపి మాధవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సీపీ గౌష్ ఆలం అభినందించారు.
ఈ శిబిరంలో సిబ్బంది మరియు ప్రజల సహకారంతో మొత్తం 72 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు సీపీ తెలిపారు. సేకరించిన రక్తాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్‌కు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం సీపీ గౌష్ ఆలం పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రక్తదాన శిబిరం విజయవంతం చేసినందుకు, అలాగే పోలీస్ స్టేషన్ ఆవరణలో చిల్డ్రన్ పార్క్ మరియు జిమ్ ఏర్పాటుకు విశేష కృషి చేసినందుకు ఏసిపి మాధవి గారిని మరియు జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణతో పాటు వారి సిబ్బందిని సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.
Comments