రోడ్డు డామేజ్ చేసినటువంటి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి నేటి వార్త:

Rathnakar Darshanala
రోడ్డు డామేజ్ చేసినటువంటి కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి.
  నేటి వార్త: అలంపూర్ తాలూకా ప్రతినిధి అక్టోబర్ 25

రాయచూర్ రోడ్డు నుండి వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధి లోని పైపాడు గ్రామం లోకి త్రాగునీటి పైప్ లైన్ వేసే క్రమంలో దారుణంగా రోడ్డు  డ్యామేజ్ అయ్యింది.
 
రెండు వాహనములు ఎదురెదురుగా వస్తె ఒక వాహనం దిగపడే ప్రమాదం ఉంది, రోడ్డుపై ఉన్న బురద లో జారిపడుతున్నారు జరగరాని సంఘటనలు కాలు చేతులు విరిగితే బాధ్యులు ఎవరు కాంట్రాక్టర్ వహిస్తాడాపై అధికారులు బాధ్యత వహిస్తారా

రోడ్డు విడితి ఎక్కువ ఉన్న పడమర వైపు పైప్ లైన్ వెయ్యకుండా రోడ్డు విడితి తక్కువ ఉన్న తూర్పు సైడు వెయ్యడం లో కాంట్రాక్టర్ ఉద్దేశం ఏమి అని గ్రామ ప్రజలు,

వివిధ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు రోడ్డు కు అంచున లైన్ తీయడం వల్ల రోడ్డు పై బంక మట్టి మూలంగా జారీ కిందా పడుతున్నారు.

 ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పైపాడు గ్రామ మాజీ సర్పంచ్ ఏ పరంజ్యోతి మరియు రైతు సంఘం నాయకులు ఎం జానకిరామ్ రెడ్డి మరియు యువ నాయకుడు. 

బి మోహన్ బీజేపీ కౌన్సిల్ మెంబర్ బోయ వెంకటేశ్వర్లు,రైతులు సిలక్ష్మన్న. కుమ్మరి ఈరన్న ఏ నవీన్ మాజీ కౌన్సిలర్ సిపరశురాముడు బోయ రాముడు,పెద్ద ఆనందం,కె శంకర్ సంజీవరాజు కురువ వెంకటేష్ గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.
Comments