ఈ బోన్ మ్యారో వ్యాధి బాలునికి రూ.1.61 లక్షలు విరాళాల సహాయం.
By
Rathnakar Darshanala
ఈ బోన్ మ్యారో వ్యాధి బాలునికి రూ.1.61 లక్షలు విరాళాల సహాయం.
*జగిత్యాల సిఐ కరుణాకర్ ఎస్ఐ రవికిరణ్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేత*
నేటివార్త జగిత్యాల బ్యూరో ఆక్టోబర్ 31 :
గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామానికి చెందిన అల్లాడి ప్రభాకర్, అనురాధల కుమారుడు రుద్రాంన్ష్ అనే బాలుడు కొన్ని నెలల క్రితం నుండి బోన్ మ్యారో వ్యాధితో బాధపడు తున్నాడు.
వైద్యానికి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉండగా తల్లిదండ్రులు నిరుపేదలు అవడంతో వైద్య ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారు.
ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ స్పందించి ఈ నెల 4 న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సాయం అందించాలని కోరాడు.
ఫేస్ బుక్ పోస్టుకు స్పందించిన ఎన్నారైలు,ఇతర దాతలు వారి బ్యాంకు ఖాతాకు 1.61 లక్షలు పంపించారు.
వాటిలో కొంత మొత్తాన్ని గురువారం జగిత్యాల సిఐ కరుణాకర్,ఎస్సై రవికిరణ్ చేతుల మీదుగా పంపిణీ చేయించాడు. మిగతాది రుద్రాంన్ష్ తల్లి బ్యాంకు ఖాతాలో నిల్వ ఉంచారు.
ప్రభుత్వం సైతం స్పందించి రుద్రాంన్ష్ బాలుడి వైద్యానికి సహాయం అందించాలని రమేష్ కోరాడు. ఫేస్ బుక్ పోస్టుకు స్పందించిన ఎన్నారైలు,ఇతర దాతలకు రుద్రాంన్ష్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments