శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు.
By
Rathnakar Darshanala
శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు.
*భద్రత చర్యలో భాగంగా ధర్మపురి పట్టణంలో పోలీసు నార్కోటిక్ జగిలాలతో బాంబ్ డిస్పోజల్ టీమ్ సమగ్ర తనిఖీలు*
నేటివార్త జగిత్యాల బ్యూరో
ఆక్టోబర్ 30 :
జగిత్యాల జిల్లాలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడం కోసం మత్తు పదార్థాల నిర్ములానే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆశోక్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది.
ఈ క్రమంలో
గురువారం ధర్మపురి పట్టణం లో డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ డిస్పోజల్ (బిడి) టీమ్ సహకారంతో తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల సమయంలో బస్ స్టాండ్ మరియు పరిసర ప్రాంతాలను ఒక్కొక్కటిగా పరిశీలించారు.
అనుమానాస్పద వస్తువులు ప్యాకేజీలు సంచులు లేదా భద్రతకు ముప్పు కలిగించే అంశాలఫై ప్రత్యేక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ధర్మపురి సిఐ రామ్ నరసింహ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు ధర్మపురి పట్టణంలో తనిఖీ నిర్వహించడంతో పాటు భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయడం జరుగుతుందన్నారు.
పాన్ షాప్ లలో గంజాయి పదార్థాలను గుర్తించే జగిలాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించమని తెలిపారు.
గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న, ఇతరులకు విక్రయించిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల సహకారంతోనే భద్రతా చర్యలు సమర్థవంతంగా కొనసాగుతాయని అన్నారు. ఎవరైనా అనుమానాస్పద వస్తువులు వాహనాలు లేదా వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు లేదా 100 నంబర్ కి సమాచారం ఇవ్వాలి అని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు ఉదయ్ కుమార్ రవీందర్ డాగ్ స్క్వాడ్ బాంబ్ డిస్పోజల్ టీమ్‌తో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments