సింగరేణి డైరెక్టర్ (ఈ & ఎం)గా మోకాళ్ల తిరుమలరావు బాధ్యతల స్వీకరణ.
By
Rathnakar Darshanala
సింగరేణి డైరెక్టర్ (ఈ & ఎం)గా మోకాళ్ల తిరుమలరావు బాధ్యతల స్వీకరణ.
నేటి వార్త సెప్టెంబరు 01 రామ్ మందిర్ ఏరియా కాశెట్టి శివ.
సింగరేణి సంస్థలో డైరెక్టర్ (ఈ & ఎం)నియమితులైన మోకాళ్ల తిరుమలరావు సోమవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన సంస్థ ఛైర్మన్ & ఎండీ శ్రీ ఎన్. బలరామ్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సీఎండీ బలరామ్ మాట్లాడుతూ, “సింగరేణి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపులో ఈ & ఎం శాఖ కీలకపాత్ర పోషిస్తోంది. యంత్రాలు పూర్తి పని గంటలు అందుబాటులో ఉండేలా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలి.
రాష్ట్ర ప్రభుత్వ సూచనలతో సింగరేణి పెద్ద ఎత్తున సోలార్, థర్మల్ ప్రాజెక్టులు మరియు ఇతర రంగాల్లో విస్తరిస్తోంది.
ఈ ప్రాజెక్టుల విజయవంతమైన అమలులో డైరెక్టర్ (ఈ & ఎం) ప్రధాన పాత్ర పోషించాలి” అని పేర్కొన్నారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ, సంస్థ లక్ష్యాల సాధనకు ఉత్పత్తి,
ఉత్పాదకత పెంపుదల దిశగా తమ శాఖ మరింత కృషి చేస్తుందని తిరుమలరావు అన్నారు.
136 ఏళ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా గిరిజన కోయ తెగకు చెందిన అధికారి డైరెక్టర్ పదవిని చేపట్టడం గర్వకారణంగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Comments