రాయికల్‌లో దొంగల ముఠా అరెస్టు.12 తులాల బంగారం స్వదినం.
By
Rathnakar Darshanala
రాయికల్‌లో దొంగల ముఠా అరెస్టు.12 తులాల బంగారం స్వదినం.
– 12 తులాల బంగారం,
కారు,15 వేల నగదు,3 ఫోన్లు స్వాధీనం
నేటివార్త రాయికల్ ఆగస్టు 16:
రాయికల్ పరిధిలో దొంగల ముఠాపై పోలీసులు గట్టి వల వేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
నిందితుల వద్ద నుంచి 12 లక్షల విలువ చేసే 12 తులాల బంగారం, రూ.15,000 నగదు,
నిందితులు ఉపయోగించిన ఐ-20 కారు,3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విజయాన్ని జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ మీడియాకు వెల్లడించారు.వనం రాము (25), దాసరి రవి (28), వనం పాపయ్య (37),లను అరెస్టు చేశారు.
జగన్నాథం కృష్ణ (45) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వీరు కలిసి రాయికల్ టౌన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.ముఠా నిందితులు ఇళ్లలోకి చొరబడి బంగారు నగలు,వెండి వస్తువులు, నగదు అపహరించేవారని విచారణలో తేలిందని వివరించారు.
జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్,ఎస్‌ఐ లు సుధాకర్, సుధీర్ రావు తమ సిబ్బందితో కలిసి రాయికల్ శివారులోని లలితా టెంపుల్ సమీపంలోని మామిడి తోటలో దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి రాయికల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన 6 కేసులకు సంబంధించిన 12 తులాల బంగారం, రూ.15,000 నగదు, మూడు సెల్ ఫోన్లు మరియు నేరాలకు ఉపయోగించిన ఐ-20 కారును స్వాధీనం చేసుకున్నారు.
ఇవే కాకుండా, ఈ ముఠా జగిత్యాల,
రాయికల్,మల్యాల, భూపాలపల్లి,భద్రాచలం తదితర ప్రాంతాల్లో 30 కి పైగా దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది.
నిందితులపై అలవాటుపడ్డ నేరస్తుల కింద సీట్స్ ఓపెన్ చేసి నిఘా కొనసాగించనున్నారు.ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన పోలీసు బృందాన్ని సీఐ సుధాకర్,
ఎస్‌ఐ లు సుధాకర్, సుధీర్ రావు,హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, పోలీసు సిబ్బంది సుమన్‌లను జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ అభినందించి,నగదు బహుమతులు అందజేశారు.
డీఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ,“జిల్లాలో ఎక్కడైనా దొంగతనాలు చేసినా వారిని వదలము.
నిందితులను పట్టుకోవడంలో పోలీసులు వేగంగా స్పందించి, కేసులను ఛేదించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
విలువైన ఆభరణాలు,నగదు భద్రంగా ఉంచుకోవాలి” అని సూచించారు.
Comments