Ap :యంత్రం షెడ్డులోకి.... దోమలు ఇంట్లోకి.
By
Rathnakar Darshanala
యంత్రం షెడ్డులోకి.... దోమలు ఇంట్లోకి.
. *దోమకాటుకు గ్రామాలు విలవిల*
*.మూలనపడిన యంత్రాలు*
*.కొరవడిన అధికారుల పర్యవేక్షణ*
కారంపూడి మండలం:నేటివార్త
కారంపూడి :దోమకాటుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్యా నిర్వహణ, దోమల నివారణకు గత ప్రభుత్వం హయాంలో వేలాది రూపాయలు వెచ్చించి,
మండలానికి సుమారు 12 ఫాగింగ్ యంత్రాలు కొనుగోలు చేయగ కొన్ని పంచాయతల్లో చెడిపోగా, మరికొన్ని పంచాయతీల్లో మూలాన పడ్డాయి.
దోమకాటుకు గ్రామవాసులు విలవిలా డుతున్నారు. దీనివలన డెంగీ, మలేరియా, టైపాయిడ్తొ పాటు ఇతర వైరల్ జ్వరాలు తాడవం చేస్తున్నాయి.
దోమలు నివారణకు కొనుగోలు చేసిన యంత్రాలు పంచాయతీల్లో లేకపోవడం గమనార్హం. అప్పటి ప్రభుత్వం ఒక్కో యంత్రానికి రూ. 35వేల నుంచి రూ.45వేలు వెచ్చించి కొనుగోలు చేసింది.
వర్షాకాలం మొదలైనప్పటి నుండి గ్రామాల్లో ఫాగింగ్ చెయ్యమని అధికారులు ఆదేశాలు ఇచ్చిన పంచాయతీ కార్యదర్శులు మాత్రం వారి ఆదేశాలను భేఖాతరు చేస్తున్నారు.
డిజిల్, పెట్రోల్, లిక్విడ్ లను సమ పద్ధతుల్లో వినియోగించకపోవడంతో యంత్రాలు చెడిపోయినట్లు తెలుస్తుంది.
*దోమలు స్వెరవిహారం*
గ్రామ పంచాయతీల్లో వారంలో రెండుసార్లు ఫాగింగ్ చేపటాల్సి ఉంటుంది. వర్షాకాలం సిజన్ ప్రారంభంలో వీటి వినియోగం మరింత ఎక్కువ చేసిప్పుడే దోమలను నియంత్రణ చేయవచ్చు.
గ్రామం మొత్తoగా నెలలో ఒక్కసారి కూడా ఫాగింగ్ చేయడం లేదు.ఒకసారి పిచికారీ చేసిన ఫోటోలనే ప్రతి నెల వినియోగింస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామాల్లో ఫాగింగ్ చెపట్టకపోవడంతో దోమలు స్వెరవిహారం చేస్తున్నాయి.
Comments