బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం:టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క.

Rathnakar Darshanala
బీసీలకు 42% రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం:టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క.
*జైనూర్‌లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సంబరాలు*

నేటి వార్త జైనూర్ :

జైనూర్: తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ జైనూర్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. 

రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని సుగుణక్క స్వాగతించారు.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల కృషిని తెలంగాణ సమాజం గుర్తించాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, 

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రివర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమేత విశ్వనాథ్,మండల ప్రెసిడెంట్ ముఖిత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కోప్షన్ మెంబెర్ అఫ్రోజ్ ఖాన్ మాజీ ఎంపీటీసీ అజ్జు లాల వసీమ్ హైదర్ దావత్ రావ్ గంగారాం గోపీనాథ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments