కాళేశ్వరంలో గత ప్రభుత్వ అవినీతి బట్టబయలైంది.
By
Rathnakar Darshanala
కాళేశ్వరంలో గత ప్రభుత్వ అవినీతి బట్టబయలైంది.
నేటి వార్త వేములవాడ నియోజవర్గం ప్రతినిధి మల్లేశం గౌడ్
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో పలు కార్యక్రమం నిర్వహించిన విప్ ఆది శ్రీనివాస్
కవిత వ్యాఖ్యలతో మరింత నిజమైంది
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
మేడిపల్లి మండల కేంద్రంలో 50 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేసిన విప్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికతో గత ప్రభుత్వ అవినీతి బట్టబయలైందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..బుధవారం మేడిపల్లి మండల కేంద్రంలో మేడిపల్లి, భిమారం మండలాల పరిధిలోని 50 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు..
వారు మాట్లాడుతూ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకుందని కానీ కవిత ఆనాడే హరీష్, సంతోష్ రావు అవినీతిపై కవిత ఎందుకు స్పందించలేదని అన్నారు..కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు హరీశ్ రావు, సంతోష్ రావేనా,బీఆర్ఎస్ ఉంటే ఎంత? లేకుంటే ఎంత అనే దాకా కవిత వెళ్ళిందన్నారున్
కవిత కుటుంబ కలహాలతో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని,హరీష్ అసెంబ్లీలో చెప్పింది నిజమా? కవిత ఈరోజు చెప్పింది నిజామా అని ప్రశ్నించారు..
కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్పిందే కవిత ఈరోజు చెప్పింది,హరీష్ రావు అక్రమాలను బయట పెట్టిందే రేవంత్ రెడ్డి అని అన్నారు..
గత ప్రభుత్వం లాగా నియాతృత్వ పోకడలకు పోకుండా ప్రజా ప్రభుత్వంలో ప్రజలు చెప్పేది విని ముందుకు పోవడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తుందన్నారు..అనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభం చేసి 2 లక్షల పరిమితి ఉంటే నేడు ప్రజా ప్రభుత్వంలో దానిని 10 లక్షలకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు...
ముఖ్యమంత్రి సహాయనిది ద్వారా ప్రజలకు వారి వైద్య ఖర్చులను తిరిగి వారికి చెల్లించడం జరుగుతుందన్నారు.. ఇప్పటి వరకు మన ప్రాంతంలో సుమారు 20 కొట్లు పై చిలుకు ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్విసీ లను మంజూరి చేయడం జరిగిందని తెలిపారు..
మొన్నటి రోజున రుద్రoగి మండల కేంద్రానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చిన సందర్భంగా భిమారం మండల కేంద్రానికి ప్రభుత్వా భవనల నిర్మాణం చేపట్టాలని కోరగానే వెంటనే వారు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు..
పలు వినాయక మండపాలను దర్శించుకున్న విప్
భిమారం,మేడిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో నెలకొల్పిన గణేష్ మండపలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. స్వామి వారి అనుగ్రహంతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని వేడుకొన్నారు
Comments