ఆర్టీసీ బస్టాండ్ లో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.:మాచర్ల జూనియర్ సివిల్ జడ్జ్.
By
Rathnakar Darshanala
ఆర్టీసీ బస్టాండ్ లో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం.:మాచర్ల జూనియర్ సివిల్ జడ్జ్.
పల్నాడు జిల్లా బ్యూరో సెప్టెంబర్ 2(నేటి వార్త)
స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల ఆర్టీసీ బస్టాండ్ లో ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, పెద్దలు మాచర్ల జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ హాజరై ముందుగా మెట్టు గోవింద రెడ్డి తో కలిసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి అనంతరం ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.
అనంతరం జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి మాట్లాడుతూ స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ లోని ప్రయాణికులకు మూడు పూటలా నిత్య అన్నదానం చేయడమే కాకుండా ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా హర్షనీయమని ఇలాంటి మంచి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు గోవిందరెడ్డి ని అభినందిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా మాచర్ల మరియు పరిసరాల గ్రామ ప్రజలకు స్వామి వివేకానంద స్ఫూర్తితో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయుట, ఎక్కడ సేవా అవసరము అక్కడ స్వామి వివేకానంద ట్రస్ట్ ఉండటం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు.
మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ బత్తుల వీరస్వామి మాట్లాడుతూ అన్నదానం చేయడం, అనాధ శవాలకు అంత్యక్రియలు చేయడమే కాకుండా ప్రయాణికుల సౌకర్యార్థం ఉచిత మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయమని స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ గోవిందరెడ్డిని అడగగానే మంచి నీటి వసతికల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం కల్పించినందుకు డిపో మేనేజర్ కి, సిఐ కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.
మానవుడై పుట్టినందుకు ఈ పేద ప్రజల కోసం ,సమాజం కోసం, దేశం కోసం చనిపోయే లోపు ఒక చిన్న మంచి పని చేసి చనిపోమన్నా వివేకానంద స్ఫూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు గోవిందరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిఐ వై .యగ్రయ్యగారు, రిటైర్డ్ హెచ్ఎం ముత్యాల పాపి రెడ్డి, అందుగుల చంద్రయ్య ,సంగీతం మాస్టర్ షేక్ చిన్న లాలు సాహెబ్, ఈ హరిబాబు ,ఈ శ్రీనివాసరావు, రామాంజనేయులు, సుబ్బారావు ,గుంటూరు ప్రభావతి, రుక్మిణి, రాజేశ్వరి ,ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్, స్టాప్ సిబ్బంది ,ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు..
Comments