మార్కాపురం ను జిల్లాగా వెనువెంటనే ప్రకటించాలి-వెలిగొండ జలాల సాధన సమితి.
By
Rathnakar Darshanala
మార్కాపురం ను జిల్లాగా వెనువెంటనే ప్రకటించాలి-వెలిగొండ జలాల సాధన సమితి.
నేటి వార్త సెప్టెంబర్ 4 గిద్దలూరు ఆర్సి ఇంచార్జ్ :
మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, కనిగిరి అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు శ్రీశైలం మండలాన్ని కలిపి మార్కాపురం జిల్లాను వెంటనే ప్రకటించాలనీ,
వెలిగొండ ప్రాజెక్టు కాల్వలకు వెంటనే నీళ్ళు విడుదల చేయాలనీ మార్కాపురం జిల్లా వెలుగొండ జలాల సాధన సమితి అధ్యక్షుడు మన్నేపల్లి వెంకటేశ్వర్లు రాష్ట్ర సచివాలయం లోని సంబంధిత మంత్రుల ఆఫీసులో వినతిపత్రం అందించారు.
అనంతరం మన్నేపల్లి వెంకటేశ్వర్లు మరియు శివప్రసాద్ లు మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా మార్కాపురం జిల్లాను ప్రకటించాలని మరియు నూతన మార్కాపురం జిల్లాను మార్కాపురం,
గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం,కనిగిరి అసెంబ్లీ నియోజక వర్గాలతో పాటు శ్రీశైలం మండలాన్ని కలిపి ప్రకటించాలని సంబంధిత మంత్రుల కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించామని తెలిపారు.
మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని కలపటం వల్ల రాష్ట్రంలోనే కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ మరియు పుణ్యక్షేత్రంలో పరిపాలన వ్యవస్థ ఎంతో మెరుగవుతుందనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలి అని పేర్కొన్నారు.
అంతే కాకుండా మార్కాపురం, కడప, నెల్లూరు జిల్లాలలోని కరువు ప్రాంతాలకు వర ప్రదాయని అయిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వహణకు కూడా ఈ నిర్ణయం ఎంతో త్వరితగతిన పూర్తవుతుందని అన్నారు.
కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి 3 డివిజన్లు మార్కాపురం, ఒంగోలు, కందుకూరులను విభజించి 1970వ దశకంలో ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేసారన్నారు.
ఇందులో భాగంగా ముఖ్యంగా ఐదు విషయాలను వినతిపత్రం ద్వారా విన్నవించామని వారు తెలిపారు. అందులో మార్కాపురం నూతన జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించాలి.
రవాణా, వైద్య, విద్య సౌకర్యాలను మెరుగు పరచాలి.
అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి కాల్వలకు నీళ్ళు విడుదల చేయాలి.
సైనికులు, మాజీ సైనికుల సంఖ్యను గౌరవిస్తూ గిద్దలూరు నియోజకవర్గంలో సైనిక స్కూలు మరియు కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలి.
దేశంలోనే పెద్దదైన కంభం చెఱువుతోపాటు మార్కాపురం చెఱువు తదితర చెఱువులు, కుంటలలో పూడిక తీసి అభివృద్ధి చేయాలి.
నూతన మార్కాపురం జిల్లాలో ఉన్నత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల విస్తరణ కోసం వివిధ సంస్థలను ఏర్పాటు చేయాలినీ విన్నవించామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మార్కాపురం జిల్లా-వెలిగొండ జలాల సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు..
Comments