Bigg Breaking :పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ₹1000 జరిమానా.

Rathnakar Darshanala
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, ₹1000 జరిమానా.
 నేటి వార్త నిర్మల్ జిల్లా ప్రతినిది సెప్టెంబర్ 2
 కడెం మండలం నచ్చన్నెల్లాపూర్ గ్రామంలో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు కఠిన శిక్ష విధించింది. 

నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు ₹1000 జరిమానా విధించింది. ఈ ఘటన 2020లో జరిగింది.

కడెం పోలీసు స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. విచారణలో భాగంగా పోలీసులు సంబంధిత సాక్ష్యాలను, ఆధారాలను సేకరించారు. కేసు విచారణ అనంతరం, నిర్మల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టులోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది.

ఈ సందర్భంగా నిర్మల్ ఎస్పీ డాక్టర్ జి.జానకి షర్మిల (ఐపీఎస్) మాట్లాడుతూ, నేరం చేసిన వారు ఎవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. 

పోలీసులు, ప్రాసిక్యూషన్ వ్యూహాత్మకంగా న్యాయ విచారణ జరిపి నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చూస్తారని తెలిపారు.

 ప్రజల భద్రత కోసం పోలీసులు కట్టుబడి ఉంటారని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ, న్యాయస్థానాల ద్వారా శిక్షలు పడటానికి అవసరమైన సాక్ష్యాలను సమర్పిస్తారని ఆమె వివరించారు.

నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. వినోద్ రావు, అలాగే దర్యాప్తు అధికారులు డి. ఉపేందర్ రెడ్డి (అడిషనల్ ఎస్పీ), టి. ప్రేమ్ దీప్ (ఎస్ఐ), ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
Comments