Jagityala :గ్రామాల్లో గాజుల సందడి.

Rathnakar Darshanala
Jagityala :గ్రామాల్లో గాజుల సందడి.
నేటివార్త రాయికల్ ఆగస్టు 31:

గ్రామాల్లో  పల్లె సంస్కృతిని ప్రతిబింబించేల రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామంలో  గాజుల పండుగ సందడి కార్యక్రమాన్ని మహిళలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు ఒకరికొకరు గాజులు వేసుకొని సంస్కృతి ప్రతిబింబించేలా పసుపు కుంకుమలు అందించుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

అనంతరం పల్లెల్లో ఉండే పాతకాలపు ఆటలతో కనివిందు చేస్తూ,ఉల్లాసంగా ఉత్సాహభరితంగా గడిపారు. 

చిన్నారుల నుండి మొదలుకొని,పెద్దల వరకు ఒకరికొకరు గాజులు వేసుకొని పల్లె సంస్కృతి ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు.
Comments