నకిలీ డిటర్జెంట్ పట్టివేత - ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి.
By
Rathnakar Darshanala
నకిలీ డిటర్జెంట్ పట్టివేత - ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.
*మహారాష్ట్ర తరలిస్తుండగా పట్టుబడిన నకిలీ డిటర్జెంట్.
*ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్లో నలుగురిపై కేసు నమోదు.
*ముగ్గురి అరెస్టు.
*స్వాధీనం చేసుకున్న డిటర్జెంట్ బహిరంగ మార్కెట్లో విలువ లక్ష రూపాయల పైచిలుకు*
*వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి.
నేటి వార్త ఆదిలాబాద్ :
*నిందితుల వివరాలు*
A1) శివాజీ ఎన్ జవాలే (40) s/o నాందేవ్, చంద్రపూర్ మహారాష్ట్ర.
A2) రామ్రావు వన్కంటి ఇంగాలే (40) s/o వన్కంటి ఇంగాలే, జీవితి చంద్రపూర్ మహారాష్ట్ర.
A3) రూపేష్ అగర్వాల్ (36) s/o బిమల్ అగర్వాల్, రాణి సతీష్ రోడ్డు అదిలాబాద్.
A4) అప్సక్ సలత్ s/o యూసఫ్ సలత్, అమరావతి. (పరారీ)
*వివరాలలో*
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రూపేష్ అగర్వాల్ అనే వ్యక్తి అమరావతి నుండి నకిలీ గడి డిటర్జెంట్ ను తీసుకువచ్చి ఆదిలాబాద్ మరియు మహారాష్ట్రలోని జివితి ప్రాంతానికి చెందిన
వ్యాపారులకు అమ్మే క్రమంలో ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని తామ్సి బస్టాండ్ ప్రాంతం నందు విశ్వసనీయ సమాచారం మేరకు
ఆదిలాబాద్ టూ టౌన్ ఎస్సై విష్ణు ప్రకాష్ మరియు సిబ్బంది బొలెరో వాహనం నందు 60 బ్యాగులలో దాదాపు 15 క్వింటల్లా నకిలీ డిటర్జెంట్ ఒక కిలో ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకోవడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పాత్రికాముఖంగా వివరాలను వెల్లడించారు.
ఆదిలాబాద్ పట్టణంలో ఎలాంటి నకిలీ వాటిని చలామణిలో ఉన్న తగిన సమాచారాన్ని పోలీసు వ్యవస్థకు అందజేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
కేసు నమోదైన నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఏ ఫోర్ నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్సై విష్ణు ప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments