కారేపల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
By
Rathnakar Darshanala
కారేపల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం.
నేటివార్త,సింగరేణి (ఆగస్టు 15):
కారేపల్లిలో సోసైటీ కార్యాలయంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, పాలకవర్గం పాలాభిషేకం నిర్వహించారు.
రైతుబంధు, వరి బోనస్ అందిస్తూ రైతుకు కొంత అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిరకాలం సీఎం గా ఉండాలని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు.
ఈసందర్బంగా సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడిరదన్నారు. రైతుకు ఇబ్బంది కల్గగుండా అనేక పధకాలు తీసుకవస్తుందన్నారు.
కారేపల్లి సోసైటీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందుబాటులో ఉంచటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గాంధీనగర్‌లో ప్రత్యేక సెల్ పాయింట్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
సోసైటీ పాలకవర్గం పదవీ కాలంను మరో 6 నెలలు పొండిగించి సీఎం రేవంత్‌రెడ్డి రైతు సేవకు అవకాశం కల్పించారన్నారు. దీనికి పాలకవర్గం కృతజ్ఞతలు తెల్పుతుందన్నారు.
ఈకార్యక్రమంలో సోసైటీ డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, బానోత్ హిరాలాల్, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, సురేందర్‌మనియార్, మేదరి వీరప్రతాఫ్, మల్లెల నాగేశ్వరరావు, అంగోత్ మత్రు, తాజుద్దీన్, తొగరు శ్రీను, నూనావత్ సాయికిరణ్, ఆదెర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.
Comments