తెలంగాణ ఉద్యమ నేత జడల వెంకటేశ్వర్లు మృతి.
By
Rathnakar Darshanala
తెలంగాణ ఉద్యమ నేత జడల వెంకటేశ్వర్లు మృతి.
-నివాళ్లు ఆర్పించిన ప్రముఖులు.
నేటివార్త,సింగరేణి (ఆగస్టు 15):
తెలంగాణ మలి దశ ఉద్యమ నేత జడల వెంకటేశ్వర్లు (62) గురువారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మలి దశ ఉద్యమంలో అనేక ఉద్యమాలలో కేసీఆర్‌తో కలిసి జడల వెంకటేశ్వర్లు పాల్గన్నారు.
కారేపల్లి ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయటంతో జడల పాత్ర ఎనలేనిది. ఆయనకు భార్య జడల వసంత, కుమారుడు కళ్యాణ్, కుమార్తె ఉన్నారు.
జడల మృతదేహాన్ని శుక్రవారం బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, డీసీసీబీ మాజీ చైర్మన్ కురాకుల నాగభూషణం,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి సందర్శించి నివాళ్లు ఆర్పించారు.
Comments