KRK కాలని లో ఉన్న బస్తీ దవాఖానా ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

Rathnakar Darshanala


కె ఆర్ కె కాలని లో ఉన్న బస్తీ దవాఖానా ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

నేటి వార్త ఆదిలాబాద్ :

సోమవారం  జిల్లా కలెక్టర్  రాజర్షి షా  ఆకస్మికంగా జిల్లా కేంద్రంలోని కే ఆర్ కే కాలనీ లో ఉన్న బస్తీ దవాఖాన – ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్శనలో దవాఖానలో సరిపడినంత మందుల స్టాక్ ఉందో లేదో అనే విషయాన్ని పరిశీలించారు. అలాగే రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యత పై అధికారులను ప్రశ్నించారు. దవాఖాన నిర్వహణకు సంబంధించిన రిజస్టర్లను , 

రోగుల నమోదు వివరాలను, ఔషధాల జాబితాను , స్టోర్ రూమ్, అటెండెన్స్ రిజిష్టర్, , ప్రయోగశాల పరీక్షలు నమోదు చేస్తున్నది లేనిది , మందులు ప్రాపర్ గా ఉన్నాయా లేవా , ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉన్నాయా లేదో చెక్ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడుతూ  వైద్యసేవలు అందిస్తున్న తీరును అడిగి తెలుసుకొని, వర్షాకాలం లో  తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటిస్తూ శుభ్రంగా ఉనాడాలని సూచించారు.

వైద్యసిబ్బంది తో  మాట్లాడి, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే దిశగా కొన్ని సూచనలు చేశారు. 

ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో పారదర్శకత ,  సమర్థత ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో   డాక్టర్ డి శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ సుమలత, ల్యాబ్ టెక్నీషియన్ వెంకన్న,తదితరులు ఉన్నారు.

Comments