వికలాంగుల & చేయూత ఆసరా పెన్షన్ దారుల కమిటీ.
By
Rathnakar Darshanala
వికలాంగుల &చేయూత ఆసరా పెన్షన్ దారుల కమిటీ.
*నేటివార్త రిపోర్టర్:- రజనీకాంత్ నేత మెరుగు*
బెజ్జంకి మండంలోని
బేగంపేట గ్రామంలో MRPS గ్రామశాఖ సమన్వ్యయంతో బెజ్జంకి శంకర్ ఆధ్వర్యంలో
పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల మరియు చేయూత ఆసరా పెన్షన్ దారుల ,
MSP కమిటీల నిర్మాణం లో భాగంగా బేగంపేట గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వికలాంగుల హక్కులపోరాట సమితి (VHPS ), అధ్యక్షులు గా అన్నాజీ దేవయ్య ,
చేయూత ఆసరా హక్కుల పోరాట సమితి (CPHPS )అధ్యక్షురాలు గా
కొరివి భారతి ,
MSP అధ్యక్షులు గా బెజ్జంకి పోచయ్య ల ను మరియు పూర్తి కార్యవర్గ సభ్యులను గ్రామస్తుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగింది . ఈ కార్యక్రమం లోమండల ఇంచార్జి చింతకింది పర్శరాములు, మండల అధ్యక్షులు వడ్లూరి పర్శరాములు ,
స్థానిక మాజీ సర్పంచ్ చింతలపెల్లి సంజీవరెడ్డి హాజరై మాట్లాడుతూ గౌరవ మందకృష్ణ మాదిగ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షండ్లు పెంచుతాం అని హామీ ఇచ్చి ఇరవై మాసములు గడుస్తున్న అమలు చేయకుండా వికలాంగుల ఆసరా పెన్షన్ దారుల ఓట్లు వేయించుకో ని మోసం చేయడం ను నిరసిస్తూ పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ వచ్చే నెల ఆగస్టు 13 న హైదరాబాద్ లో LB స్టేడియం లో మహాగర్జన సభ పెట్టడం చాలా చాలా మంచిది దానికి మేము పూర్తిగా మద్దత్తు ఇసున్నాం మా గ్రామం నుండి అధికసంఖ్యలో పాల్గొంటాం అని కొనియాడారు. మండల నాయకులు మోదుంపెల్లి రాజు, మంకాల బాలయ్య, గ్రామ పెన్షన్ దారులు, MRPS కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments