jainoor : భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని వినతి.

Rathnakar Darshanala
ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున భీం వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని వినతి.

నేటి వార్త జైనూర్ :

జల్ జంగల్ జమీన్ కోసం నైజం సర్కారుతో విరోచిత పోరాటం చేసి అసువులు బాసిన ఆదివాసీల ఆరాధ్య దైవం..పోరాట యోధుడు అమర జీవి కుమురం భీం వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రతి 

ఏటా ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహించేందుకు  ప్రత్యేక జీ. ఓ విడుదల చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ ఆదివారం *కుమురం భీం మనవడు కుమురం సోనేరావు జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ తో కలిసి ఖానాపూర్ MLA వేడ్మా బొజ్జుపటేల్ గారికి వినతి పత్రం అందజేశారు*. 

ఆదివాసీల హక్కుల సాధనకు నైజాం సర్కారుతో చేసిన తిరుగుబాటు ఉద్యమం లో ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున మరణించడంతో ప్రతి ఏటా సంస్కృతి సంప్రదాయ బద్దంగా అదే రోజు వర్ధంతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని 

కలసూచి ప్రకారం వర్ధంతికి ప్రత్యేక తేది అంటూ లేదని గుర్తుచేశారు. ప్రభుత్వం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజునే భీం వర్ధంతి నిర్వహించేలా ప్రత్యేక జి. ఓ విడుదల చేసేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడంతో MLA వేడ్మా బొజ్జుపటేల్ సానుకూలంగా స్పందించారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వర్ధంతికి సంబంధించిన జీ. ఓ విడుదలతో పాటు ఇతరత్రా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మెస్రం అంబాజీ, చిర్లె లక్ష్మణ్ యాదవ్, మండాడి లింగు తదితరులు పాల్గొన్నారు...
Comments