హరితహారం పై అవగాహన ర్యాలీ.

Rathnakar Darshanala
హరితహారం పై అవగాహన ర్యాలీ.
నేటి వార్త పెద్దపల్లి ప్రతినిధి జూలై 20 అడిచర్ల రమేష్

ఒక చిన్నారి-ఒక చెట్టు అనే నినాదంతోజమాత్-ఎ-ఇస్లామీ హింద్ వారి చిన్న పిల్లల విభాగం (సి.ఐ.ఓ.) ఆధ్వర్యంలో –'మట్టి లో చేయి,హృదయంలో భారతం’ ఉద్యమంలో భాగంగా,పెదపల్లి పట్టణంలో భారీ పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీ ఫారాన్ పాఠశాల నుండి ప్రారంభమై మస్జిద్ చౌరస్తా మీదుగా జెండా చౌరస్తా వరకు కొనసాగింది.6 నుండి 13 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన పిల్లలు బ్యానర్లు పట్టుకుని,నినాదాలు చేస్తూ,చెట్లు నాటే అవసరం, 

పర్యావరణ పరిరక్షణ,భవిష్యత్తు తరాల కోసం పచ్చదనం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన  జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ హై జావిద్, పట్టణ అధ్యక్షులు ఎం.ఏ. మోహిద్ మాట్లాడుతూ చిన్నపిల్లలలో చిన్నతనం నుండే చెట్లు నాటే కార్యక్రమం చేపట్టాలని,తద్వారా చిన్నపిల్లలలో అవగాహన పెరిగి చెట్లు నాటే కార్యక్రమం విజయవంతం అవుతుందని, 

వారికి చిన్నతనం నుండే చెట్ల ఆవశ్యకతను వివరించి చెట్లు నాటే విధంగా ప్రోత్సహించాలని, ఒక చెట్టును నాటి రేపటి జీవనాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లాం నాయకులు ఆరిఫ్ ఉద్దీన్, వసీయుద్దీన్,ఫారెన్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మలీహా ఇరాం,మహ్మూదా బేగం,నాజియ ఇఫ్రాసన, ఫాతిమా,హలీమా సాదియా,సాజిదా బేగం,సానియా,పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comments