వ్యక్తి ప్రాణం తీసిన వ్యవసాయ భూమి గెట్టు పంచాయతీ.
By
Rathnakar Darshanala
వ్యక్తి ప్రాణం తీసిన వ్యవసాయ భూమి గెట్టు పంచాయతీ.
ఇబ్రహీంపట్నం జులై 22(నేటి వార్త ప్రతినిధి నల్ల రంజిత్ కుమార్) ఇబ్రహీంపట్నం మండలంలో భూ తగాదా ఓ వ్యక్తి ప్రాణం తీయడంతో ఉద్రిక్తత నెలకొంది.
మూలరాంపూర్ గ్రామానికి చెందిన గూడ గంగాధర్ 43తన పెద్దనాన్న కొడుకు గూడ రవి 36 తో గత రెండు సంవత్సరాలుగా 12 గుంటల భూమిపై వివాదం కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఈ నెల 9న గంగాధర్,రవి వ్యవసాయ భూమి సరిహద్దును చెక్కుతుండగా రవి వచ్చి ప్రశ్నించాడు.
ఈ చిన్నతరహా వాగ్వాదం ముదిరి గంగాధర్ కోపం కట్టలు తెంచుకుంది తన చేతిలో ఉన్న పారతో రవి తల ముఖంపై విచక్షణ రహితంగా దాడి చేశాడు.
దీంతో.తీవ్రంగా గాయపడిన రవిని కుటుంబ సభ్యులు మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి చేర్చారు.
అయితే చికిత్స పొందుతూ సోమవారం రాత్రి రవి మృతి చెందాడు మృతుడి భార్య గూడ రజిత ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం కేసును హత్యగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటన స్థలాన్ని మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ పరిశీలించారు.
Comments