Jagityala :సీసీ రోడ్డుతో కొత్త సమస్యలు. నిలిచినా మురుగు నీరు.

Rathnakar Darshanala
సీసీ రోడ్డుతో కొత్త సమస్యలు. నిలిచినా మురుగు నీరు.
-మురుగు నీరు నిలిచి దుర్గంధం.

– దోమల హవా, పందుల స్థైర్య విహారం.

నేటివార్త రాయికల్,జూలై 22: 

అభివృద్ధి పేరుతో నిర్మించిన సీసీ రోడ్డు స్థానికులకు శాపంగా మారింది.

రాయికల్ మున్సిపల్ రెండవ వార్డులో రోడ్డు నిర్మాణం తలెత్తుగా చేయబడటంతో,వర్షాలు పడిన ప్రతీసారి మురుగు నీరు ఆరితేరే దారి లేకపోవడంతో, నివాస ప్రాంతాల మధ్యలో ఒకే చోట నిలిచిపోతోంది. 

దాంతో దుర్వాసన, దోమల వృద్ధి, అంతటితో ఆగకుండా ఇప్పుడు పందులు కూడా స్థిరంగా విహరిస్తుండటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెత్త నీరు నిలిచిన ప్రాంతం చిన్న కొలంబాకి మారిపోయింది. దోమల ఉద్ధృతి రాత్రిళ్ళు ప్రజలను నిద్రలేక వదలడం లేదు.

 చిన్నారుల ఆరోగ్యం పైన ముప్పు పొంచి ఉంది. అధికారుల వైఖరిపై ప్రజల్లో గగ్గోలు మొదలైంది."సీసీ రోడ్డు వేసిన ముందు డ్రైనేజీ రాకపోయినా,నీరు పక్కదారి పోయేది. 

ఇప్పుడు కింద తలమునక అయినట్టే అయిపోయింది. ఇంటి బయట నిలిచిన నీటిలో పందులు ఈదుతూ తిరుగుతున్నాయి. ఇది అభివృద్ధా? అభద్రతా?" అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సకాలంలో నీటి పారుదల మార్గాలను ఏర్పాటు
చేయకపోతే,జన ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుందని  ప్రజలు బాధపడుతున్నారు.
మున్సిపల్ అధికారులు తక్షణమే జోక్యం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments