యూజీసీ నెట్‌లో అర్హత సాధించిన ఎస్ కెఎన్ ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి ఎస్.రాజశేఖర్.
By
Rathnakar Darshanala
యూజీసీ నెట్‌లో అర్హత సాధించిన ఎస్ కెఎన్ ఆర్ కళాశాల పూర్వ విద్యార్థి ఎస్.రాజశేఖర్.
నేటివార్త జగిత్యాల బ్యూరో జులై 22:
ఇటీవల ప్రకటించిన యూజీసీ నెట్ అర్హత పరీక్షల్లో ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి ఎస్. రాజశేఖర్ ఘన విజయం సాధించాడు.
2021-22 విద్యా సంవత్సరంలో బీకాం పూర్తి చేసి, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.కామ్ చేసిన ఆయన,కామర్స్ విభాగంలో అర్హత సాధించి కళాశాలకి గౌరవం తీసుకొచ్చాడు.
ఈ విజయాన్ని పురస్కరించుకుని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరిగెల అశోక్,వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కామర్స్ అధ్యాపకులు గోవర్ధన్,లెఫ్ట్నెంట్ రాజు సాయి,మధుకర్,సురేందర్,కే. శ్రీనివాస్ లు రాజశేఖర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులకి ప్రేరణగా నిలిచిన రాజశేఖర్ భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలని వారు ఆకాంక్షించారు.
Comments