HYD :సైబరాబాద్ సీపీ కార్యాలయంలోఉచిత వైద్య శిబిరం.
By
Rathnakar Darshanala
సైబరాబాద్ సీపీ కార్యాలయంలోఉచిత వైద్య శిబిరం.
*-సైబరాబాద్ పోలీస్ అండ్ ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో ఎంటీ సిబ్బందికి నాలుగు రోజుల ఆరోగ్య శిబిరం*
నేటి వార్త, సైబరాబాద్:
సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్ సి ఎస్ సి), గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్, మరియు ప్రిస్టైన్ ఐ విజన్ ఫౌండేషన్ సంయుక్తంగా మంగళవారం సైబరాబాద్ హెడ్‌క్వార్టర్ లో ఉచిత వైద్య ఆరోగ్య పరిశీలన శిబిరాన్ని ప్రారంభించారు.
పోలీస్ సిబ్బందిలో ముందస్తు వైద్య పరీక్షల ద్వారా ఆరోగ్య పరిరక్షణను ప్రోత్సహించడమే ఈ శిబిరం ఉద్దేశం. ఈ నాలుగు రోజుల వైద్య శిబిరం (జులై 22 నుంచి 25 వరకు) ప్రత్యేకంగా సైబరాబాద్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి చెందిన 685 మంది సిబ్బంది కోసం నిర్వహించనున్నారు.
ఉదయం 7:00 గంటల నుంచి 9:00 గంటల మధ్య రక్త నమూనాలను సేకరణ జరుగుతుంది. ఆ తరువాత ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 4:00 గంటల వరకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ శిబిరంలో ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలలో ఎత్తు, బరువు, బిఎంఐ, బీపీ, రక్త పరీక్షలు – డయాబెటిస్, ఎఫ్బిఎస్, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ టెస్ట్‌లు, హెచ్ బి ఏ 1సి, సీరమ్ క్రియాటినిన్ – ఉన్నాయి.
కంటికి సంబంధించిన పరీక్షలు, కరోనరీ ఆర్టరీ కి సంబంధించి స్క్రీనింగ్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. పరీక్షల ఫలితాల ఆధారంగా అవసరమైన వారికి మందులు సూచిస్తారు.
అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత ఆసుపత్రులకు రిఫర్ చేస్తారు. ఈ సందర్భంగా సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) డా. గజరావు భూపాల్, ఐపీఎస్., శిబిరాన్ని సందర్శించి, ఆర్గనైజర్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇతరముఖ్యఅతిధులు సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఏడీసీపీ శామీర్,సి ఎస్ డబ్ల్యూ ఏడీసీపీ హనుమంత రావు, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నావేద్ ఆలమ్ ఖాన్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ గ్లోబల్ సీఈఓ అండ్ ఎస్‌సీఎస్‌సీ హెల్త్ ఫోరమ్ జాయింట్ సెక్రటరీ డా. చిన్నబాబు,
ఎస్‌సీఎస్‌సీ హెల్త్ మేనేజర్ ప్రవీణ్ ఉమ్మడి, ప్రిస్టిన్ ఐ విజన్ ఫౌండేషన్ చైర్మన్ డా. జగదీష్ రెడ్డి నేతృత్వంలోని బృందాలు పాల్గొన్నారు.
మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ఎం టీ ఓ -I ప్రశాంత్ బాబు, ఎం టీ ఓ-2 వీరలింగం, సైబరాబాద్ వైద్యులు డా. సుకుమార్, డా. సరిత తదితరులు పాల్గొన్నారు.
Comments